– చోడవరం మేజర్ పంచాయతీ కార్యదర్శి నారాయణ రావు….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 26.07.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం పారిశుధ్యానికి సహకరించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐ.ఎస్.ఎల్) సర్వే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి నారాయణరావు సిబ్బందిని కోరారు. పంచాయతీ పరిధిలో సచివాలయం సిబ్బంది తో బాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సహకారంతో సర్వే పూర్తి చేయాలన్నారు. సచివాలయం, అంగన్వాడీ ఆశ కార్యకర్తలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పారిశుధ్యం, త్రాగు నీటి సమస్యలపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి నూకాలమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.