విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : వాసవి క్లబ్ వారోత్సవాలులో భాగంగా మూడోవ రోజు మంగళవారం శ్రీ లలితా దేవి వృద్ధ ఆశ్రమం కి యూత్ క్లబ్ తరఫున కిరాణా సామాన్లు, కూరగాయలు పళ్ళు సుమారు 3600/-విలువ గల సామాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్, సెక్రటరీ పెన్నం రాజు, ట్రెజరర్ కొల్లూరు సంతోష్, ఆర్.సి. సత్యవరపు శ్రీనివాసరావు, జెడ్.సి. పూసర్ల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మణికొండ చక్రవర్తి, వి కే ఎస్ పి ఇన్చార్జ్ ఉదయగిరి చందు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీనివాస్ టీం సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జరిగింది.