విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.09.08.2024ది. చోడవరం ప్రేమ సమాజంలో అంబేద్కర్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్, సివిల్ జడ్జి నడుపూరు సన్యాసిరావు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. నేటి యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ అంబేద్కర్ భవన్ చైర్మన్ బొడ్డు కళ్యాణ్ రామ్, అంబేద్కర్ ట్రస్ట్ కార్య నిర్వాహకులు కండెల్లి వెంకటరావు, భూపతి రాజు, ప్రేమ సమాజం కార్యదర్శి రాజు, వృద్ధులు విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు.