London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

గోవాడ సుగర్స్ బకాయి చెల్లింపులు …

విశాలాంధ్ర – చోడవరం : రాష్ట్రంలోని సహకార చక్కెర మిల్లులన్నింటిలో అగ్రగామిగా నిలిచి, నడుస్తున్న ది.చోడవరం కో ఆప్ సుగర్స్ (గోవాడ) లో 2023-24 క్రషింగ్ సీజన్ కు గాను చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు బకాయి పేమెంట్లు నేటికీ పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని ఏ.పి చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకట రమణ (కాసు బాబు) అన్నారు. స్థానిక మీడియాతో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు రైతు సంఘం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గోవాడ చక్కెర కర్మాగారంకు సరఫరా చేసిన సభ్య రైతులకు బకాయి పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఎం.డి. వి.ఎస్.నాయుడు ఈ ఏడాది జూన్ చివరి వారంలో ప్రకటించారు. బకాయిలు పై ఎం.డి. ప్రకటన విడుదల చేసి రెండు నెలలు దాటుతున్నను, నేటికీ సభ్య రైతులు ఖాతాలో చెరకు పేమెంట్లు జమ కాలేదని తెలిపారు. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటేయడంతో చెరకు రైతుల్లో మరింత ఆందోళన మొదలయిందన్నారు. 2023-24 కృషింగ్ సీజన్లో ఫిబ్రవరి 16 నుండి మార్చి 12 వరకు అనగా ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపివేసే వరకు 6346 మంది మొదటి విడతగా తన్నుకు రూ.2,500లు చొప్పున సభ్య రైతులకు బకాయి పడిన రూ. 15.32 కోట్లు చెల్లింపులు జరుపుతామని ఈ ఏడాది జూన్ 29న పత్రికా ప్రకటన చేసి ఉన్నారన్నారు. మిగిలిన బకాయిలు టన్నుకు రూ. 419.75 పై.లు రెండవ విడత లో జమ చేస్తామన్నారు. కొంత మంది రైతులకు పేమేంట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినప్పటికి, పలు కాటాల పరిధిలో సుమారు రూ 7.5 కోట్లు పేమెంట్లు జమ చేయవలసి వుంది. ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో సభ్య రైతులు నుండి సేకరించిన 1,70,601 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరపగా, 1,46,309 క్వింటాళ్ల పంచదార, 19 లక్షల 4 వేల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఫ్యాక్టరీ లో కార్మికులకు కార్షకులకు బకాయి పడిన పేమెంట్లు తక్షణమే చెల్లించాలని, చెరకు సభ్య రైతాంగం, నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img