విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.15.07.2024ది. ఏపీ లో జరిగే 2024 మెగా డిఎస్సీ లో అర్హత పరీక్ష టెట్ కు హాజరయ్యే బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు వైజాగ్ బ్రాహ్మీణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావూరు చరణ్ కుమార్ సోమవార ఓ ప్రకటనలో తెలిపారు.
ఏ.పి. ప్రభుత్వం త్వరలో నిర్వహించే మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో అర్హత కోసం టెట్ మరియు డీఎస్సీ (సెకండరీ గ్రేడ, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు) నిర్వహించడం జరుగుతుంది. దీనికి హాజరయ్యే అర్హులైన బ్రాహ్మణ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు చరణ్ కుమార్ తెలియ చేశారు. అర్హులైన బ్రాహ్మణ అభ్యర్థుల నుంచి ఈ ఉచిత శిక్షణ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
శిక్షణ కు వచ్చే అభ్యర్థులు తమ పదో తరగతి, టిటీసీ , లేదా బి.ఈడి, డి ఈడి, ఆధార్, జీరాక్స్ ధృవ పత్రాలను సమర్పించాలని తెలిపారు.
రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్లు
9962599790 ను గానీ, 9246625822 ను గానీ సంప్రదించవచ్చన్నారు.