విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.22.08.2024ది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌లను (1091 మరియు 7837018555) సంప్రదించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేసారు. ఇటువంటి మెసేజ్/ వార్తతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు, మహిళలు, యువత ఈ సందేశాన్ని నమ్మి, మోసపోవద్దని తెలియజేసారు.
మీ భార్య, కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ ఈ వార్తను చేరవేయ వలసిందిగా వారు కోరుతున్నారు.