విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : నిరుద్యోగుల జీవితాలతో అధికార ప్రభుత్వాలు చెలగాటం ఆడుకుంటున్నాయని ప్రభుత్వ మద్యం దుకాణ కార్మికులు ఆరోపిస్తున్నారు. ” సేవ్ మై జాబ్” అంటూ చోడవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద మంగళవారం వారు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను అవసరం వున్నంత వరకు వాడుకున్నారని, ప్రభుత్వ వైన్ షాప్ కార్మికులను అధికార కూటమి ప్రభుత్వం వదిలేసారు అని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం హయాం లో పని చేస్తున్న వైన్ షాప్ వర్కర్లను, ఈ ప్రభుత్వం ఈ నాలుగు రోజులు పని చేయండి, విధులు వదిలి వెళ్ళిపోండి అంటూ తమ కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ప్రభుత్వం, అధికారులు ఆలోచనలు వున్నాయని చెబుతున్నారు. ఐదేళ్లు పాటు తమను వినియోగించుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.