…. విశాలాంధ్ర – చోడవరం : తే.26.02. 2024ది. రాష్ట్రంలోని సహకార రంగంలో అన్నింటిలో అగ్ర పదాన నిలిచిన ది.చోడవరం కో ఆపరేటివ్ సుగర్స్(గోవాడ) లో 2023 -24 క్రషింగ్ సీజన్ ను మార్చి 5 తారీకు సి షిఫ్ట్ తో ముగించునున్నట్లు ఎం.డి. వి. సన్యాసినాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఏడాది క్రషింగ్ చెరకు సరఫరా అగ్రిమెంట్ రాసిన సభ్య రైతులు గమనించవలసిందిగా కోరారు. గతేడాది డిసెంబర్ 15 న సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాట లక్ష్యంగా చోడవరం సహకార చక్కెర కర్మాగారం (గోవాడ)లో 2023-24 సీజన్ ప్రారంభించారు. 2022-23 క్రషింగ్ సీజన్ లో 2 లక్షల 21 వేల ఎం.టి. చెరకు గానుగాడినట్లు తెలియజేశారు. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఈ ఏడాది చెరకు గానుగాట కీలకంగా మారిందన్నారు. ఫ్యాక్టరీ చరిత్ర లో కీలకమైన దశ అని తెలిపారు. ఈ ఏడాది చెరకు గానుగాటకు సహకరించిన సభ్య రైతులు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు, కర్షకుల బకాయిలు చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటా మని, ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితి బావుంటే, సభ్య రైతులకు మరిన్ని సదుపాయములు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఈ. ప్రసాద్, సి.డి.ఒ. కె.రామం, తిరుమల రావు, రామారావు, యేడువాక శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు కె.భాస్కరరావు, ఫీల్డ్ ఇన్స్పెక్టర్ లు ఎస్.వి.నాగేశ్వర రావు, దొర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.