Friday, December 1, 2023
Friday, December 1, 2023

యోగా గురువు పుల్లేటి సతీష్ కి ఘన సత్కారం …

విశాలాంధ్ర – చోడవరం : చోడవరం పతంజలి శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ ను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ లో జరిగిన యోగ అవగాహన కార్యక్రమానికి ఆహ్వానించి, ఆంధ్ర యూనివర్సిటీ యోగ విభాగం డైరెక్టర్ భాను కుమార్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఏయూ ఆచార్య భానుకుమార్ మాట్లాడుతూ వయసులో చిన్నవాడైన యోగ అనుభవంలో సుమారు 20 సంవత్సరాలు నుండి తన సొంత గ్రామం చోడవరంలో పతంజలి యోగా శిక్షణ కేంద్రాన్ని స్థాపించి ఎంతోమందికి యోగ మీద అవగాహన కల్పించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మరియు ఎంతోమంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా తీర్చిదిద్ది మన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు యోగ ద్వారా ఎంతో పేరు తీసుకొచ్చారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ జిల్లా హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత విసి డాక్టర్ పి శ్యాంప్రసాద్ యోగానంద స్వామీజీ విశాఖపట్నం జిల్లా యోగా సంఘం అధ్యక్షులు యోగ రాజు కార్యదర్శి సిహెచ్ వెంకటరమేష్ యోగ టీచర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img