విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. ఐ.వి.రామిరెడ్డి అధ్యక్షతన పాఠశాల కమిటీ చైర్మన్ గుమ్మాల సత్య మరియు వైస్ ఛైర్మన్ పిల్లి నాగమణి, గ్రామ నాయకులు గుమ్మాల సత్యనారాయణ ఆధ్వర్యం లో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో ముందుగా స్వర్గీయ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.