విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.20.08 2024ది. లవ్ జిహాదీ లకు నేటి యువత అక్రమంగా బలి అవుతున్నారు. వేషం, రోషం, నటన చాతుర్యానికి మోసపోయిన యువత, ఆ ఉచ్చు నుండి బయట పడుదామని అనుకునేంతలోనే,…. నన్ను ” విడిచి వెళ్ళావో, పొడిచి చంపేస్తా” అంటూ బెదిరింపులు. ఆడ పిల్లల తల్లి తండ్రులకు ఇదో పెను సవాల్ గా మారి, కడుపు శోకంతో పోలీస్ స్టేషన్ లకు, ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకున్నను ఈ చెవి నుండి విని, అవతల చెవి నుండి విడిచిపెడుతున్నారు. బైటకు చెబితే పరువు పోతుందనే గొప్ప కుటుంబాల బాధ వర్ణనాతీతం. కాలేజీల్లో ను, బయట ప్రదేశాల్లోనూ లోకం తీరు తెలిసి, తెలియని యువతను ఆకర్షణలో దింపి, దాన్ని ప్రేమ పేరుతో మూడు ముళ్ళు వరకు సాగిస్తున్న ముష్కరుల మోసానికి .. ఎందరో యువత బలి పశువులుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో పోలీస్ రికార్డ్ ల ప్రకారం ఆడ పిల్లలు మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీన్ని ఛేదించే నాధుడే కరువయ్యాడు, ….. తస్మాత్ జాగ్రత్త… అంటూ మహిళా, ప్రజా సంఘాలు, తల్లితండ్రులు నేటి యువత కు చెప్పకనే చెబుతున్నాయి.