Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

కృష్ణ, గోదావరి నదీ జలాలు పునః పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – చోడవరం : తే.08.08.2024ది. కృష్ణా, గోదావరి నదీ జలాలు పునః పంపిణీ ద్వారా ఏ.పి. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకోవాలని అనకాపల్లి జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కు వినతపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నందు కృష్ణా నది జలాలు పంపిణీ ద్వారా మన రాష్ట్ర నీటి హక్కుల్ని కాపాడ వలసిన సమయం ఆసన్నమైందని తెలియజేసారు.
ఆగస్టు రెండో వారం లోపు ప్రభుత్వం తో కూడిన వాదనలతో కూడిన బ్రిజేష్ కుమార్ నివేదికను ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు గత ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని, ఏ.పి.కు కృష్ణా గోదావరి నదులకు చివర రాష్ట్రమైనందున అటు వరదల వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతాంగం నష్టపోయే పరిస్థితులు వున్నాయని తెలియజేసారు. దాపురిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్ర రైతాంగాన్ని గమనించి తగిన పరిహారాన్ని అందచేయడానికి ట్రిబ్యునల్ పోరాడవలసినది.
గోదావరి నదీ నీటి పంపిణీ విషయం చర్చించేందుకు ఉభయ రాష్ట్రాలు మధ్య ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని,
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పై అంశాలు చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు సాగునీటి రంగ నిపుణులతో సమావేశం నిర్వహించగలరని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ద్వారా తమ వినతులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి చేరవేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కమ్యునిస్టు నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి బాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం కార్యవర్గ సభ్యులు గురు బాబు, కొర్బిలి శంకర్రావు. పప్పల ఈశ్వరరావు, లక్ష్మీ మరియు రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img