విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం మరియు బెంగళూరు శివ జ్యోతి యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 23 24 25 తేదీల్లో జాతీయస్థాయి యోగ పోటీలు ఆన్లైన్ లో నిర్వహించనున్నట్లు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. అలాగే యోగ మీద ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలని సంకల్పంతో ఈ యోగాసనా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, 8 సంవత్సరాలు నుండి 80 సంవత్సరాల వరకు విద్యార్థులు, బాల బాలికలకు, స్త్రీలకు పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్, మెమొంటోస్ కొరియర్ ద్వారా ఇవ్వబడునని తెలియజేస్తూ మరిన్ని వివరాలకు 9291276900 మొబైల్ నెంబర్ ను సంప్రదించవలసినదిగా యోగ గురువు పుల్లేటి సతీష్ తెలిపారు.