విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) :ప్రజలు దాహార్తిని తీర్చేందుకు అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు ఆదేశాల మేరకు శనివారం వాటర్ ట్యాంక్ లతో మంచినీరు సరఫరా చేశారు. చోడవరం మేజర్ పంచాయతీ 10వ వార్డు పరిధిలో స్దానిక ద్వారకానగరం, బానయ్య కోనేరు, పూర్ణా దియేటర్, రెల్లి వీధి, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రజలందరికీ త్రాగు నీరు సరఫరా చేశారు. వారం రోజులు గా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, మహిళలు అనేక ఇబ్బందులు పడుతు0డటంతో, ఎమ్మెల్యే రాజు పంపిన వాటర్ ట్యాంక్ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 10 వ వార్డ్ మెంబర్ నేమాల హరి, ఫోటో కోటి, టి.డి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.