విశాలాంధ్ర – చోడవరం : తే.01.11.2023ది. అనకాపల్లి జిల్లా, చోడవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులుగా 108 లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల కు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను ట్రైనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎటువంటి కేసులు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని అనగా ప్రెగ్నెన్సీ, ఆర్టీఏ, పాయిజన్, కార్డియాక్, మరియు రెస్పిరేటరీ కేసుల గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు అందరు పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లా మేనేజర్ వి.త్రినాధ రావు అనకాపల్లి డివిజన్ మేనేజర్ వై నాగేశ్వరరావు నర్సీపట్నం డివిజన్ మేనేజర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.