విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.15.08.2024ది. ఆత్యవసర సమయాల్లో ఆపన్న హస్తం అందించే 108 వాహనం విశాఖ జిల్లా మేనేజర్ వడ్డాది త్రినాథరావు (రవి) ఉత్తమ ఉద్యోగి అవార్డును రెవెన్యూ మంత్రి ఏ.సత్యప్రసాద్ చేతుల మీదుగా గురువారం అందుకున్నారు. ప్రభుత్వ విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేసిన ఉద్యోగులను గుర్తించి, వారి సేవలకు గాను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం తరఫున అవార్డులతో సత్కరించారు. ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్న వడ్డాది త్రినాధ్ (రవి) అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన వాడు కావడంతో ఎమ్మెల్యేతో సహా పలువురు ప్రముఖులు మిత్రులు అభినందనలు తెలిపారు.