Friday, June 2, 2023
Friday, June 2, 2023

అంగరంగ వైభవంగా నవమి వేడుకలు

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని పలు గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే మంగళ వాయిద్యాలు, గ్రామ పెద్దలు పల్లకీలో స్వామి వారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి సీతారాములకు మంగళ స్నానాలు చేయించి పట్టువస్త్రాలు కట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ పండమేటి వెంకటరమణస్వామికి పురోహితులు ఫలపుష్పాలతో అలంకరణ చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎస్వీవీయూ సభ్యురాలు తోపుదుర్తి నయనతారెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ పసుపుల హేమావతి, వైసీపీ కన్వీనర్, యూత్ కన్వీనర్లు జూటూరు శేఖర్, చిట్రెడ్డి సత్తిరెడ్డితోపాటు
భక్తులు, ప్రజలు హాజరై కోరిన కోరికలు తీర్చే కొంగబంగారం వెంకటరమణస్వామికి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి కాపులైన బండ్లపల్లి గ్రామస్తులు పెద్దఎత్తున హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో జిల్లాస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు. ఉరవకొండకు చెందిన వృషభాలు 922.2 అడుగులు లాగగా మొదటి బహుమతి రూ.60వేలు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గార్లదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన లక్ష్మీరెడ్డి వృషభాలు 926 అడుగులు లాగగా రెండో బహుమతి రూ.50వేలు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, గార్లదిన్నె కు చెందిన రామాంజనేయులు వృషభాలు 662.5 అడుగులు లాగగా మూడో బహుమతి కింద రూ.40వేలు ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సత్యనారాయణరెడ్డి, ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన సుధాకర్ యాదవ్ వృషభాలు 612.3అడుగులు లాగగా నాలుగో బహుమతి రూ.30వేలు జెడ్పీటీసీ పసుపుల హేమావతి ఆది, గుంతకల్లు మండలం నాగసముద్రం కు చెందిన జి. జయరామిరెడ్డి వృషభాలు 315.10 అడుగులు లాగగా ఐదో బహుమతిని రాప్తాడు గంజి రాముడు రూ.20వేలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img