విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అంబేద్కర్ భావాలు విద్యార్థులకు ఆచరణీయం అని
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ ఇంచార్జ్ ఆచార్య రామ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దీన్ దయాల్ ఉపాధ్యాయ సమావేశం మందిరంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 132వ జయంతోత్సవాలలో సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ ఆలోచనలను నేటితరం విద్యార్థులు ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. వి.వి.ఎన్. రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ అంబేద్కర్ భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారన్నారు. మరో ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ వి.ఎల్.వి.ఎన్. నరేంద్రకుమార్ మాట్లాడుతూ… దేశంలోని అనేక సామాజిక సమస్యలకు అంబేద్కర్ పరిష్కారాలను చూపారన్నారు. ఇతర అధ్యాపకులు డా।। సునీత కుమారి, డా।। కె. నాగార్జున, డా।। సుభద్ర, మనోజ లు మాట్లాడుతూ… కింది కులాలు, వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎలా పాటుపడ్డారో తమ తమ ప్రసంగాలలో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిభారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పాత్రు అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తానికి ఆర్థికశాఖ అధ్యాపకులు డా।। ఎమ్. కులశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు పి. రామకృష్ణా రెడ్డి వందన సమర్పణ చేశారు.