విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని అమ్మవారి పల్లి గ్రామం నందు అసైన్డ్ భూమి లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రాగా గురువారం తాసిల్దార్ స్వర్ణలత రెవెన్యూ ఇన్స్పెక్టర్ పురుషోత్తం మరియు గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నంబర్లతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని వాటికి తగిన అనుమతులు తీసుకోవాలని ఆమె తెలిపారు ఇప్పటివరకు జరిపిన నిర్మాణాలను గురించి పై అధికారులకు తెలియజేసి ఇక నిర్మాణాలు జరుక్కోకూడదని తెలిపారు.