Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అక్రమ మద్యం రవాణా- ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.. వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర-ధర్మవరం : రాబడిన రహస్య సమాచారం మేరకు ఆదివారం బోయ వీధిలో వెంకటేష్ నాయక్ ముత్యాలు అనే ఇరువురు ఒక తెల్లని సంచిలో మద్యం బాధ్యులు పెట్టుకొని కూర్చుని ఉండగా, అదుపులో తీసుకొనగా, వారి వద్ద నుండి 18 ఆంధ్ర మద్యం బాటిలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం సోమవారం విలేకరులతో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతున్న, రవాణా చేసిన, గంజాయి అమ్మిన, మట్కా ,పేకాట ఆడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని వారు తెలిపారు. అటువంటి సమయంలో సెల్ నెంబర్..9440796831 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img