Friday, February 3, 2023
Friday, February 3, 2023

అథ్లెటిక్‌ మీట్‌లో బాలాజీ విద్యాసంస్థల విద్యార్థుల పతకాల పంట

విశాలాంధ్ర- జె ఎన్‌ టి యుఏ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల అథ్లెటిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ లో శ్రీ బాలాజీ విద్యాసంస్థల విద్యార్థులు పతకాల మోత మోగించారు. అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం పతకాలు అందుకున్నారు. అనంతపురంలోని పి.వి.కే.కే. పీజీ కళాశాలకు చెందిన బాల సాయి 400 మీటర్స్‌ పరుగులో బంగారు పతాకం , 1500 మీటర్స్‌ లో రజతం సాధించగా, ముదిగుబ్బ ఎస్‌. డి.అర్‌. అర్‌ కళాశాలకు చెందిన ప్రత్యూష 100 మీటర్స్‌, 200 మీటర్స్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ విభాగాల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. కాగా ఈ ప్రదానోత్సవంలో కళాశాల ప్రతినిధులుగా ప్రిన్సిపాల్‌ డా వై. మునికృష్ణా రెడ్డి, కళాశాల ఏ ఓ ధనుష్‌, సూపర్‌ వైజర్‌ రమణ హాజరై విద్యార్థులతో పాటు పతకాలు అందుకున్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఎస్‌.కే యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కమిటీ సెక్రెటరీ శ్రీనివాస్‌, బాలాజీ విద్యాసంస్థలు అధినేత డా పల్లె రఘునాథ్‌ రెడ్డి, చైర్మన్‌ పల్లె కిషోర్‌, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img