సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి…
విశాలాంధ్ర-గుంతకల్లు : అదాని గ్రూపు ఆస్తులు జప్తు చేసి జాతీయం చేయాలని సీపీఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముఖ్య అతిథులు సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థని ప్రధాని మోడీ గౌతమ్ ఆదాని చిన్నాభిన్నం చేశారని అన్నారు మోడీ లాంటి ప్రధాని భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను విమానాశ్రయాలను, పోర్టులు, బొగ్గు ,విద్యుత్ ,సిమెంట్ ,ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ తదితర రంగాల సంస్థలను గౌతమ్ ఆదానికి కట్టబెట్టేందుకు పూనుకున్నారన్నారు. కరోనా ప్రమాదకర సమయంలో ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేశారని అన్నారు. సామాన్య ప్రజలకు ఆకలి తీర్చలేని మోడీ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టి మోడీ అండతో ఆదాని ప్రపంచ కుబేరుడు అయ్యాడన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు అమలుపరచకుండా తీరని అన్యాయం చేశారన్నారు.పార్లమెంట్లో నోరు మెదపని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు భారత దేశ ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆదాని గ్రూప్ కంపెనీలు ఇండియన్ బర్గ్ బట్టబయలు చేసిందన్నారు. బ్యాంకు రుణాల పేరుతో జనం సొమ్ము ఎగ్గొట్టే వారికి అండగా మారిన బిజెపి ప్రభుత్వం మోడీ మౌనం వీడి ఆదాని ఆస్తులు జప్తు చేసి జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య ,ఎఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్ ,మహిళా సమైక్య నియోజకవర్గం కార్యదర్శి రామాంజనమ్మ, సిపిఐ నాయకులు మురళీకృష్ణ ,మల్లయ్య ,లక్ష్మీనారాయణ, నందు, గురుస్వామి, సూరి ,గడ్డం భాష ,భాస్కర్ ,రవి కుమార్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.