Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

అనాధలకు ఆత్మబంధువులైన సత్యసాయి సేవాసమతి

విశాలాంధ్ర= పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ నందు శనివారం సత్యసాయి సేవా సమితి వారు మానసిక వికలాంగులు మతిస్థిమితం లేని వారికి వృద్ధులకు అనాధలకు సేవ చేయడం సాయి తత్వం మానవత్వం, మనం ఎవరికి సేవ చేసినా అది పరమాత్మ సేవగా భావించాలి: పెనుకొండలో గత ఐదు నెలలుగా మతి స్థిమితం లేని ఒక అతను ఏ ప్రాంతం నుండి వచ్చినాడో ఏమో , మనకు తెలియని భాషలో మాట్లాడుతూ ఉంటాడు. 24 గంటలు తిరుగుతూ ఉంటాడు, శరీరానికి వాడి పారవేసిన ప్లాస్టిక్ కవర్లను ధరించి ఉంటాడు భయంకరంగా కనిపిస్తాడు. ఎవరైనా దయతలచి ఏమైనా తినడానికి ఇవ్వాలని అనుకున్న అతనికి దగ్గరకు వెళ్లేవారు కాదు, అలాంటి వ్యక్తిని శ్రీ సత్య సాయి సేవ సమితి పెనుకొండ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ కృష్ణ గ సేరదీసి అతని శరీరంపై ఉన్నటువంటి పాత కవర్లను, దుస్తులను తొలగించి, అతనికి, మిత్రుల సహకారంతోస్నానం చేయించి, శుభ్రమైన బట్టలు ఆహారం అందజేసినారు, భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ సేవ చేస్తున్నాము అని తెలియజేసి నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణకి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని సత్య సాయి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img