Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

అన్ని వర్గాలను వంచించిన చంద్రబాబు ఓ మోసగాడు

: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : నలబై ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక మోసగాడు అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. శనివారం అనంతపురంలోని ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో ఏర్పాటుచేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ప్రతిపక్ష చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ కాదని, తిట్లు దండకాల పార్టీ అని అర్ధమవుతోందని మండిపడ్డారు. అందరికి మేలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ ను ఉద్దేశించి దుర్భాషలు మాట్లాడడం దారుణమన్నారు. నీకు ఇవే చివరి ఎన్నికలని… నోరు చించుకుని మాట్లాడుతూ లేని అనారోగ్యాలు తెచ్చుకుని మాట్లాడితే సహించేదిలేదన్నారు. 2019లో ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి..వచ్చే ఎన్నికల్లో అవికూడా రావన్నారు. ఎన్నో రోజులు ప్రజల్ని మోసం చేయలేననేది చంద్రబాబుకు తెలిసే ఆయనకు చివరి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు ఖబడ్డార్‌… నువ్వు, నీ కుమారుడు, దత్తపుత్రుడు పవన్‌ అంతా కలిసినా జగన్మోహన్‌ రెడ్డికి ఎదురేలేదన్నారు. దురదృష్టపశాత్తూ వైఎస్‌ఆర్‌ చనిపోయిన తర్వాత చంద్రబాబు అవసరం కాంగ్రెస్‌ కు వచ్చిందని, ఆయన సహకారంతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, వైఎస్‌ జగన్‌ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగిందన్నారు. జగన్‌ ను సీఎం చేయాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పసిగట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని విడదీశారని విమర్శించారు. జగన్‌ సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, బిజేపితో పోటీపడి రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చింది వాస్తవం కాదా అన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన ఉత్తర కుమారుడిని మంత్రిని చేసుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసి దోచుకున్న దోపిడి, చంద్రబాబు దోపిడీ ప్రజలకు తెలిసిందే అన్నారు. కాగ్‌ నివేదికలు కూడా ఇచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం ఇవ్వాలని ఇవే నాకు చివరి ఎన్నికలని ప్రజలను వేడుకోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అప్పుల పాలు చేస్తే.. జగనన్న ఆసరాగా నిలిచారన్నారు. అన్ని వర్గాల వారికి అండగా నిలిచారని, 30 లక్షల మంది పేదలకు ఇంటిపట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేసి లక్షల విలువ చేసే ఆస్తిని అప్పగిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img