Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం..

ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం : అన్ని వర్గాల ప్రజలకుసమ న్యాయం చేయడమే జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 15 వ వార్డు నేసే పేటలో వారు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు ప్రజలు కొన్ని సమస్యలను చిలకం దిష్టికి తీసుకొని రాగా, మా అధినేతకు తెలిపి సమస్య పరిష్కారం అయ్యే దిశలో తాను కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరము తాను పోరాడుతానని తెలిపారు. చేనేతల వారికి, మైనారిటీ సోదరులకు, ఎస్సీ, బీసీ వర్గాలను ఆదుకొని, వారిని పటిష్టంగా ఉండేటట్లు చేస్తానని తెలిపారు. ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి, వైసిపి పాలనను అంతం చేయడమే మా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీనీ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img