Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఆటో బోల్తా పడి ఒకరు మృతి మరో ఐదుగురికి గాయాలు

విశాలాంధ్ర- ఉరవకొండ : కూలీలను తీసుకెళుతున్న ఆటో బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలి గ్రామానికి చెందిన దాదాపు 16 మంది కూలీలు శనివారం ఉదయం ఆటోలో విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో మిర్చి తొలగించడానికి వెళ్తుండగా ఉరవకొండ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న గంగన్న మృతి చెందగా మల్లమ్మ, సుంకమ్మ పె న్నక్క,అంజనమ్మ, కుమారి అనే మహిళ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నలుగురిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాద సంఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img