Monday, March 20, 2023
Monday, March 20, 2023

ఆత్మకూరు మండలంలో తాసిల్దారుని నియమించండి

సిపిఐ మండల కార్యదర్శి నీళ్ల పాల రామకృష్ణ వినతి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆత్మకూరు మండలం లో తహసిల్దారు,లేక ప్రజలుచాలా ఇబ్బందులు పడుతున్నారు తహసిల్దార్ నాగభూషణ సెలవు మీద రెండు నెలలు అనారోగ్యంతో సెలవు పెట్టడంతో తాసిల్దార్ నియమించాలని సిపిఐ మండల కార్యదర్శి నీళ్లపాల రామకృష్ణ సోమవారం డిప్యూటీ తాసిల్దార్ వరప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆత్మకూరు మండలంలో పనిచేస్తున్నటువంటి తాసిల్దార్ రెండు నెలలుగా అనారోగ్యంతో సెలవు పై వెళ్లడం జరిగిందన్నారు. ఇంతవరకు ఏ తహసిల్దారు రాకపోవడంతో ప్రజలకు ఏ పని చేయించుకోవాలనుకున్న తహసిల్దార్ లేడు అంటున్నారు. కావున వెంటనే ఆత్మకూరు మండలానికి తహసిల్దార్ నియమించాలని కోరడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ ఆత్మకూరు మండల సహయ కార్యదర్శి బండారు శివ ,గోపాల్ నాయక్ రమేష్,శీన తదితరులు పాల్గొన్నారులి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img