Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

ఆధార్ స్పెషల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోండి…

ఇంచార్జ్ ఎంపీడీవో మమతా దేవి
విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని ఏలుకుంట్ల సచివాలయంలో ఈనెల 18, 19, 20, అండ్ 26, 27 వా తేదీలలో ఆధార్ స్పెషల్ క్యాంపును(మొత్తం ఐదు రోజులు) నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ ఎంపీడీవో మమతా దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మంగళవారం మాట్లాడుతూ జీరో సంవత్సరము నుంచి ఐదు సంవత్సరాల వారికి శిశు ఆధార్ తీయబడునని, ఆరు సంవత్సరాల నుండి ఆధార్ కార్డు, దీంతోపాటు గత పది సంవత్సరాలుగా ఆధార్ అప్డేట్ చేయని వాళ్ళు కూడా అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ఏలుకుంట్ల చుట్టుపక్కల గల గ్రామ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img