Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై సమీక్ష

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై కసరత్తు ఈనెల 30వ తేదీ నుండి నెల రోజులు పాటు జరగబోవు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి. దేవి మరియు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ప్రోగ్రామ్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా 25 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్రంగా చేసుకొని వైయస్సార్ క్లినిక్స్ నందు డాక్టర్స్ టీమ్ చేత వైద్య పరీక్షలు మరియు చికిత్సలు అందించడం జరుగుతుందని డిఎంహెచ్వో ఒక ప్రకటనలో తెలిపారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏఎన్ఎంలు ఇంటింటి సర్వేలో ప్రజలను స్క్రీనింగ్ చేసి సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఈ హెల్త్ క్యాంప్స్ నందు డాక్టర్ల చేత ఉచిత వైద్యం తో పాటు మందులు అందిస్తారని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తారు అని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాట్లకు 15 రోజులు ముందుగానే పట్టణ మరియు గ్రామాలలో ఫీల్డ్ సిబ్బంది చేత క్యాంపెనింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సిహెచ్వోలు ,ఏ యన్ ,యం .లు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం పథకం రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రొగ్రమ్ ఆఫీసర్స్ డా.సుజాత ,చెన్నకేశవులు, కిరణ్ కుమార్ రెడ్డి, నారాయణస్వామి, మనోజ్, మహేంద్ర నాథ్, ఓబులు, ఉమాపతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img