Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఆలయ నిర్మాణానికి విరాళం

విశాలాంధ్ర- బొమ్మనహళ్: మండలంలోని నేమకల్లు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కొల్లాపురమ్మ దేవి ఆలయ నిర్మాణానికి శనివారం నేమకల్లు గ్రామంలో గ్రామ పెద్దలకు రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి 25 వేల రూపాయలు విరాళం అందజేశారు ఆంజనేయస్వామి ఆలయంలో ఏపీఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న కొల్లాపూర్ అమ్మ దేవి ఆలయానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్వర స్కూల్ కమిటీ చైర్మన్ మహేంద్ర ఎంపిటిసి చిక్కన్న శాంతయ్య అన్నదాన కమిటీ చైర్మన్ రామాంజనేయులు మల్లప్ప ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img