Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకరించండి… ఆలయ అభివృద్ధి సంఘం

విశాలాంధ్ర`ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహాయ సహకారాలు అందించాలని సిద్దయ్య గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు జయశ్రీ, కార్యదర్శి గంజికుంట గంగాధర్‌, ఉపాధ్యక్షులు పుట్లూరు నరసింహులు, కోశాధికారి కలవల మురళీధర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు ఆలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 600 సంవత్సరాల క్రిందట గల ఈ దేవాలయం ఎంతో మహిమగల ఆలయం అని, కొన్ని అనివార్య కారణాల వలన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. తదుపరి ఆలయ పునర్నిర్మాణానికి తలంచి కమిటీగా ఏర్పడి ఆలయ నిర్మాణం చేపట్టదలిచామని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టదలిచామని తెలిపారు. ఈ ఆలయానికి దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం సమావేశంలో అధ్యక్షురాలు జయశ్రీ మాట్లాడుతూ గర్భకుడికి అయ్యే ఖర్చులంతా తానే సొంతంగా భరిస్తానని తెలిపారు. తదుపరి కమిటీ సభ్యులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కావున దాతలు సహకరించి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పడి వారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గడ్డం పార్థసారథి, నిర్మాణ సలహాదారులు కే. నాగరాజు, మధుసూదన్‌ రెడ్డి- హైదరాబాద్‌, ఆళ్లగడ్డ శిల్పి రంగా మల్లికార్జున, ఏ. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img