Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పట్టణంలోని కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు చెందిన బిఏ.. ప్రథమ సంవత్సరం చదువుతున్న దీపక్ కుమార్, బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న కే.వినయ్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ గత నవంబర్ నెల 24 వ తేదీల్లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించిన ఎంపికలో, ఉత్తమ ప్రతిభను ఘనపరిచి, ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ విద్యార్థులు కేరళలోని మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 12వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆల్ ఇండియా పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఈ విద్యార్థులను, ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఆనందు, అధ్యాపక, అధ్యాపకే తర సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించి, హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img