Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించాలి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ బషీర్ అహ్మద్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు 3-5-23 తారీకు లోపల తమ పరీక్ష రుసుమును చెల్లించాలని అలాగే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన వారికి 155 రూపాయలు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారికి 520 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అలాగే ఇంప్రూవ్మెంట్ కోరే అభ్యర్థులకు మొత్తం సబ్జెక్టులకు 520 రూపాయలు చెల్లించాలని ప్రతి సబ్జెక్టుకు 160 రూపాయలు చెల్లించాలని పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు ఉండదని కావున 3 వ తేదీ లోపల కళాశాలకు వచ్చి తమ ఫీజు చెల్లించవలసిందిగా తెలిపారు
అలాగే కళాశాల నందు పరీక్షలందు తప్పిన వారికి స్పెషల్ ట్రైనింగ్ క్లాసులో ప్రారంభమవును కావున విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని సబ్జెక్టు వారీగా మరియు అన్ని సబ్జెక్టుల వారిగా స్పెషల్ కోచింగ్ ఇవ్వబడునని 1-5-23 తారీకు నుంచి 20వ తేదీ వరకు జరుగునని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహించబడాలని విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ బషీర్ అహమ్మద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img