Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవం…

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో సత్యనారాయణ పేట వార్డు సచివాలయంలో అధ్యక్షురాలు ఎస్ఎంటి త్రిష్లా బన్సాలి రోగులకు రోగ నిరోధక శక్తి పెంచేందుకు డాబర్ చావన్ ప్రాష్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రిష్లా బన్సాలి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా లాంటి మహమ్మారి వల్ల అనేకమంది రోగ నిరోధక శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నందున ప్రస్తుత నేపథ్యంలో ముందస్తుగా రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు మంచి ఆహార అలవాట్లతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ సాయి, రామకృష్ణ, సచివాలయ అడ్మిన్ హరి భూషణ్ ,ఏఎన్ఎం సురేఖ, ఆశా వర్కర్ నారాయణమ్మ ,ఇన్నర్ విల్ క్లబ్ సభ్యులు బిందు ,రేణు శ్రీ ,శాంత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img