Monday, March 20, 2023
Monday, March 20, 2023

ఈనెల 26 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

విశాలాంధ్ర-ఉరవకొండ : ఈనెల 26వ తేదీ నుంచి మార్చి నెల 4వ తేదీ వరకు కూడా ఇంటర్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. మమత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కళాశాలలో 232 మంది జనరల్ విద్యార్థులు 162 మంది వృత్తి విద్య కోర్సు కు సంబంధించిన విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో కూడా సిసి కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పరీక్షలు ఉదయము 9 గంటలకు మధ్యాహ్నము 2 గంటలకు ఉంటాయన్నారు విద్యార్థులు అందరూ కూడా ముందుగానే పరీక్షలు యొక్క తేదీలు సమయాన్ని చూసుకొని హాజరు కావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img