Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఈనెల 5వ తేదీ లోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు ..ఈనెల 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఈనెల 5వ తేదీలోపు ఓటర్ స్లిప్పుల పంపిణీని పూర్తిచేయాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఉదయం అనంతపురం రాజేంద్ర నగర పాలక ఉన్నత పాఠశాల, రాప్తాడు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పోలింగ్ సిబ్బందికి వసతి సౌకర్యాలు కూడా సక్రమంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఓటర్ స్లిప్పుల ప్రక్రియను పరిశీలించి ఈనెల 5వ తేదీలోపు ఓటర్ స్లిప్పులను పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్పులు తీసుకోని వారి జాబితా, ఏ కారణం చేత తీసుకోలేదో అట్టి అంశాలను కూడా ఆ జాబితాలో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం, రాప్తాడు తహశీల్దార్లు శ్రీధర్ మూర్తి, లక్ష్మీనరసింహ, ఈడీటీ మల్లికార్జున తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img