Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఈ- క్రాప్ బుకింగుతోనే ప్రభుత్వ పథకాలు : జేడీఏ చంద్రానాయక్

విశాలాంధ్ర-రాప్తాడు : ఈ- క్రాప్ బుకింగుతోనే ప్రభుత్వ పథకాలు అందుతాయని జేడీఏ చంద్రానాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం రైతుభరోసా కేంద్రం పరిధిలో రబీ 2022-23 ఈ-క్రాప్ బుకింగులో భాగంగా ఈ-క్రాప్ బుకింగ్ జాబితా సామాజిక తనిఖీ ప్రదర్శనను ఆయన ఆకస్మాతుగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామ రైతులతో గ్రామ సభ నిర్వహించి జాబితాలో ని పేర్లు ను చదివి వినిపించి సరిగా ఉన్నాయా లేదా అని రైతులతో తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని ఈ-పంటలో నమోదైన పంటలు క్షేత్ర స్థాయిలో సాగు చేశారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కుడా తాము నమోదు చేసుకున్న పంట తాలూకా వివరాలను రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి సరిచూసుకోవాలని, పంట బీమా, పంట కొనుగోలు తదితర పథకాలకు రైతులు అర్హత పొందాలంటే బయోమెట్రిక్ వేలిముద్ర తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ క్రాప్ జరుగుతున్న తీరుతెన్నులను మండల వ్యవసాయ అధికారి జి.శుభకర్ వివరించారు. ఏఓతోపాటు విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అంజనరెడ్డి ,గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img