Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీర సైనికులకు నివాళులు…

ఆదర్శ పార్కు సేవా సంఘం
విశాలాంధ్ర- ధర్మవరం: భారతదేశంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పూవుంచు లో ట్రక్కు పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు సైనికులు మృతి చెందడం బాధాకరమని తెలుపుతూ శనివారం పట్టణంలోని పిఆర్టి వీధిలో గల ఆదర్శ సేవా సంఘం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదర్శ పార్కు సేవా సంఘం ఫౌండేషన్ కృష్ణమూర్తి,గౌరవాధ్యక్షులు చెన్నా సూర్య ప్రకాష్ కార్యదర్శి గుద్దిటి నాగార్జునలు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉగ్రవాదులు భారత దేశ సైనికులపై దాడి చేసి ఐదు మంది మృతికి కారకులు కావడం దురదృష్టకరమని, ఉగ్రవాద దినచర్యలకు సైనికులు బెదిరేది లేదని వారి ప్రాణాలు సైతం త్యాగం చేయడం భారతదేశ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు. రేయింపగళ్ళు దేశం కోసం,కుటుంబాలను వదిలి, ప్రాణాల సైతం త్యాగం చేస్తూ దేశాన్ని కాపాడటం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా భారతమాత ఆశీస్సులు ఉండాలని వారు తెలిపారు. ఉగ్రవాద చర్యలో మృతి చెందిన కుటుంబాలకు కూడా తమ సంతాపం తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఇటువంటి ఘటన దుశ్చర్యగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సైనికులు మరింత ధైర్యంతో ముందుకు వెళుతూ దేశానికి మరింత సేవలను అందించాలని వారు కోరారు. వీర సైనికుల మరణం ఊరికే పోదని, వారి కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా అండదండలను అందజేస్తారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం అత్యున్నత త్యాగాన్ని మరువలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు నాగభూషణం, మారుతి, శిన, మాజీ మిలిటరీ పవన్, సూర్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img