స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్లో గల స్పందన ఆసుపత్రిలో ఈ నెల 12వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంట వరకు ఉచిత సంతాన సాఫల్య పరీక్షా శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ ఆశలను, శాస్త్రవిజ్ఞానం, అనుభవం, నైపుణ్యంతో సఫలీకృతం చేయడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ప్రత్యేక సంతాన వైద్య నిపుణురాలు డాక్టర్. ప్రియాంక రెడ్డి వైద్య చికిత్సలను అందించబడుతూ, సంతాన సాఫల్యం కొరకు తగిన సలహా, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా ఐవిఎఫ్ ప్యాకేజీలపై రూ.25,000 లు తగ్గింపు కూడా విధిగా ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సంతానం లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.