కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి
కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల యందు ఎన్ఎస్ఎస్.. ధర్మవరం యూనిట్ సహకారంతో సరికొత్త అవకాశం లో భాగంగా ప్రత్యేకించి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే విధంగా ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రంగారెడ్డి కళాశాల కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి ప్రిన్సిపాల్ మల్లికార్జున ఏవో రమేషులు, తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శనివారం వారు మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇదొక మంచి చదవకాసోమని తెలిపారు. ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఈనెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు ఇంగ్లీషులో అనర్ధాలంగా మాట్లాడే విధంగా సులభ పద్ధతిలో కోచింగ్ ఇవ్వబడును తెలిపారు. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉచితంగా అందించబడునని తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.