Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఉత్తమ పోలీసులకు ఘన సన్మానం

విశాలాంధ్ర -ఉరవకొండ : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ పురస్కారాలను కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చేతుల మీదుగా అందుకున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్, ఉరవకొండ అర్బన్ కానిస్టేబుల్ కులశేఖర్ రెడ్డి, రూరల్ స్టేషన్ కానిస్టేబుల్ ఓబులేసును శుక్రవారం ఉరవకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ పోలీసులుగా ప్రశంసా పత్రాలను అందుకోవడం అభినందనీయమని ఉరవకొండ రూరల్ సీఐ శేఖర్ అర్బన్ సిఐ హరినాథ్ పేర్కొన్నారు. ఉత్తమ పోలీసులుగా ఎంపికైన ముగ్గురు నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి అంకితం భావంతో విధినిర్వాహన చేస్తున్నారని విడపనకల్లు మాజీ జడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, మండల కన్వీనర్ బసన్న, ఉరవకొండ ఉప సర్పంచ్ వన్నప్ప కో ఆప్షన్ సభ్యులు లతీఫ్ యువజన నాయకులు ధనరాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో వీరు మరిన్ని అవార్డులు ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు.ఉత్తమ పోలీసులుగా ప్రశంస పత్రాలు అందుకున్న ముగ్గురు పోలీసులను జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు అభినందిస్తూ ఘనంగా సన్మానం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img