Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఉత్సాహంగా రాతి దూలం లాగుడు పోటీలు

విశాలాంధ్ర- బొమ్మనహళ్: మండలంలోని దర్గా హోన్నూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ కేశప్ప ఆధ్వర్యంలో మండల స్థాయి రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు వివిధ గ్రామాల నుండి వృషభాలు పాల్గొన్నాయి మండల స్థాయి రాతిదూలం లాగుడు పోటీల్లో లింగ దహళ్ గ్రామానికి చెందిన ఎర్రి స్వామి వృషబాలు 3321 అడుగులులా గీ మొదటి బహుమతి 15000 దాత మాజీ సర్పంచ్ కేశప్ప చేతుల మీదుగా అందజేశారు దర్గా పొన్నూరు గ్రామానికి చెందిన గౌరీస్ వృషభలు 325 7.2 అడుగులు లాగి రెండవ బహుమతి పదివేల రూపాయలు దాత వై హనుమంతు అందజేశారు దర్గా హోన్నూర్ గ్రామానికి చెందిన చందు వృషబాలు 2 750 అడుగులు లాగి మూడవ బహుమతి 8000 రూపాయలు దాతలు ఆనంద్ నాగరాజ్ మహమ్మద్ రఫీ అందజేశారు గోవిందవాడ గ్రామానికి చెందిన మారెమ్మ అవ్వ వృషబాలు 2 726 అడుగులు లాగి నాలుగో బహుమతి 5000 రూపాయలు దాత కుమ్మరి వన్నూరప్ప చేతుల మీదుగా బహుమతి అందజేశారు రాతి దూలం పోటీల్లో తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది పాల్గొని తిలకించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామస్వామి విఎల్ రామాంజనేయులు ముక్కన్న కెపి రాజశేఖర్ వన్నప్ప చిన్నప్ప మూర్తి యుగంధర్ గోవిందా నాగప్ప వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img