Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ఉద్యోగుల ఐక్యతే సమస్యలకు పరిష్కారం

జిల్లా మలేరియా అధికారి ఒబులు
విశాలాంధ్ర`నంతపురం వైద్యం : ఉద్యోగుల ఐక్యతే సమస్యలకు పరిష్కారం చూపుతుందని జిల్లా మలేరియా అధికారి డి.ఓబులు అన్నారు. గతంలో ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సంఘం ఎంతో బలంగా ఉండేదని ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవని నాయకుల స్వార్థంతో ఉద్యోగులకు నష్టం వాటిల్లిందని గతంలో నేనూ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని పాత రోజులను జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా ఆస్కార్‌ నాయకత్వంలో పునర్వైభవం రావాలని ఆకాంక్ష వ్యక్తపరిచారు. అనంతరం డిసెంబర్‌ 11 న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుచున్న మహా సభ గోడ పత్రికను సంఘం సోమవారం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బాబాసాహెబ్‌ మాట్లాడుతూ వైద్యఆరోగ్య ఉద్యోగుల కోసం అధికారంలో ఉన్న పార్టీల తో సంబంధం లేకుండా గత నాలుగు దశాబ్దాలుగా సమస్యల సాధనకై పోరాడుతున్న ఏకైక సంఘం అని అధికారంలో రావడానికి ముందు పాదయాత్రలో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇక సమయం అట్టే లేదని ఇప్పటికైనా శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ఆమోదించిన విధానంలో నియామకమైన హెల్త్‌ అసిస్టెంట్స్‌, లాబ్‌ టెక్నిషియన్స్‌, ఫార్మాసిస్టులు, స్టాఫ్‌ నర్సులు, ఇతరత్రా క్యాడర్ల ఉద్యోగులు కాంట్రాక్ట్‌ విధానంలోనే మగ్గుతున్నారని వారి సేవలను క్రమబద్దీకరణ చేయాలని, జీవో 27 సవరణ చేసి పే, డిఎ, హెచ్‌.ఆర్‌.ఎ లతో కలిపి జీతం ఇవ్వాలని శాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌ ఎఫ్‌.అర్‌.ఎస్‌ విధానాలు సరిపడవని రాష్ట్‌ .ముఖ్యమంత్రి కి నేరుగా వినతిపత్రం ఇచ్చామని పరిశీలనకు శాఖకు పంపినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదని, జాతీయ ఆరోగ్య విధానం మేరకు కేంద్రం ఇచ్చిన ఐ.పి.ఎచ్‌.యస్‌ నియమావళిని రాష్ట్రంలో అమలుచేయడంలో అధికారులు విఫలం అయ్యారని పేర్కొన్నారు. రోజుకో ఉత్తర్వులు ఇస్తూ నియమావళి స్ఫూర్తికి విరుద్ధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని కుదిస్తున్నారని పేర్కొన్నారు. ఉప ఆరోగ్య కేంద్రాల్లో గైడ్లైన్స్‌ మేరకు మగ ఆరోగ్య సహాయకుల నియామకం చేపట్టకుండా ఉన్నవారినే సగటున 5 ఉప ఆరోగ్య కేంద్రాలకు మ్యాపింగ్‌ చేయడం విరుద్ధమన్నారు. వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. అనేక సమస్యలను రాష్ట్ర సర్వజన మహాసభలో చర్చించి తీర్మానాలను చేసేందుకు నందు జి ఆస్కారావు అధ్యక్షతన రాష్ట్ర సర్వజన మహాసభను ఈనెల 11వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం జాతీయ ఐ.ఎన్‌. టి.యు.సి అధ్యక్షులు గొంగళ్ళ సంజీవరెడ్డి, అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ప్రజారోగ్య రాష్ట్ర సంచాలకులు రామిరెడ్డి హాజరవుతారని ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని తాలూకాల ప్రతినిధులు, వేలదిగా ఉద్యోగులు హాజరు కానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు బాబాసాహెబ్‌ , నూర్‌ బాషా, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్స్‌ రామాంజనేయులు, శేఖర్‌, శివన్న, రమణయ్య, లక్ష్మ నాయక్‌, లక్ష్మీ నాయక్‌, వెంకటేష్‌, తిరుపల్‌ నాయక్‌, దేవల నాయక్‌, రమేష్‌, లోకేష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img