Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ఉపాధి కూలీలు ఎక్కువ వేతనం పొందేలా పని చేయాలి

విశాలాంధ్ర-రాప్తాడు : ఎక్కువ వేతనం పొందేలా పని చేయాలని ఎంపీడీఓ సాల్మన్ సూచించారు. మండలంలోని ప్రసన్నాయపల్లిలో ఉపాధి హామీ కూలీలు చేపట్టిన పని ప్రదేశాలను, పనులను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు కొలతల ప్రకారము పని చేయాలన్నారు.. ప్రభుత్వం రూ.257 నుండి రూ.272లకు రోజువారీ వేతనాన్ని పెంపుదల చేసినందున ఉపాధి కూలీలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటలకే పని ప్రారంభించి ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలని ఎండతీవ్రతను తప్పించుకోవాలన్నారు. గ్రూపుల వారీగా పనులు విభజించి ముందుగా మార్కింగ్‌ ఇచ్చి ఉపాధి కూలీలు పనులు చేసే లాగా టెక్నికల్‌, ఫీల్డ్‌అసిస్టెంట్లు తగినచర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు. ఎంపీడీఓ వెంట టెక్నికల్ అసిస్టెంట్ పరంధామ, ఫీల్డ్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img