Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఉపాధి హామీ కూలీలతో రోజ్గర్ దివాస్ సమావేశం

విశాలాంధ్ర- పెనుకొండ : మండల పరిధిలోని గుట్టురు గ్రామం నందు శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా అమృత్ సరోవర్ పనులు మరియు రోజ్గార్ దివాస్ పనులు జరుగుతున్నందున ఏపీవో జయమ్మ శుక్రవారం హాజరైన 203 మంది కూలీలతో సమావేశమై కూలీలకు కూలిపడుటకు రోజుకు ఎంత పని చేయాలి ఈ పనుల వలన లాభమేమిటి భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నీటి సమృద్ధితను పెంచుతాయని వీటి వలన ఎంతో ప్రయోజనం ఉందని కేంద్ర ప్రభుత్వము ఈ పనులను ఉద్దేశించిన విధంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈ వెంకటేష్, సాంకేతిక అసిస్టెంట్, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, ఉపాధి హామీ ఫీల్డ్ మెట్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img