Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఉరవకొండ టౌన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు అభివృద్ధికి పాలకవర్గం సమన్వయంతో కృషి చేస్తున్నట్లు బ్యాంక్ అధ్యక్షులు సాధు కుళాయి స్వామి, ఉపాధ్యక్షులు చంగలి మహేష్ తెలిపారు. శుక్రవారం బ్యాంకు పాత భవనంలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు నందు కొత్త సభ్యులను చేర్చుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఒక్కొక్కరి షేర్ విలువ 300 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని ఐదు షేర్స్ తక్కువ కాకుండా సభ్యత్వం తీసుకోవాలని పాలకవర్గం తీర్మానించింది అని తెలిపారు. బ్యాంకు ను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు పలకవర్గం మరియు సభ్యులందరూ కూడా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు వెంకటస్వామి, నాగరాజు, పెద్దకోట్ల శ్రీనివాసులు, మైనుద్దీన్, ఇంతియాజ్ భాష,,గిద్దలూరు వెంకటేశులు, ప్రవీణ్ కుమార్, పెద్దకోట్ల రమేష్, మరియు బ్యాంకు సీఈఓ కరణం వేదమూర్తి పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img