Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ఎంపీటీసీ సభ్యురాలు మృతి

సంతాపం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి,

విశాలాంధ్ర -ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ 6 వ స్థానం ఎంపిటిసి సభ్యురాలు పెద్దక్క (75) శనివారం గుండెపోటుతో మృతి చెందారు.పెద్దక్క ఉదయం ఇంటి ముందు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లు బంధువులు తెలిపారు.వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.ఆమె మృతికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపిటిసిలు, వైస్సార్సీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img