Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాములు స్ఫూర్తిదాయకం..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాములు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటాయని, సమాజంలో సేవా ప్రేరణ కు ఎంతో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్ ,వైస్ ప్రిన్సిపాల్ తాళంకి జీవన్ కుమార్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగపు శాఖ అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్.. విద్యార్థులు మార్చి 25 నుండి 31 వ తేదీ వరకు ఏడు రోజులపాటు స్పెషల్ క్యాంపును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా చివరి ఏడవ రోజు శుక్రవారం మండల పరిధిలోని గో ట్లురు గ్రామంలో గ్రామసర్పంచ్ పిట్టా నరసమ్మ, ఉప సర్పంచ్ ఆడవాల గంగాధర్, నరసింహులు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ తాళంకి జీవన్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ విద్యతో ఉపాధి లేని యువతపై అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మొక్కల పరిరక్షణ, విద్యా, ఆరోగ్యము, ఇంటి పరిశుభ్రత తదితర అంశాలపై వారు వివరించారు. ఈ ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంపు విద్యార్థులకు మంచి సేవా కార్యక్రమాలను అలవర్చుకోవడంతోపాటు క్రమశిక్షణను, ఉన్నత దృక్పథాన్ని అలవర్చుకునేలాగా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణకు గ్రామ సర్పంచు, ఉపసర్పంచ్ సహకారం అందజేసినందుకు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చిట్టెమ్మ, రబియా బేగం, సమీ ఉల్లా, పావని, కిరణ్ కుమార్, భువనేశ్వరి, రామ మోహన్ రెడ్డి, పుష్పావతి, గౌతమి, ఆనందు,కే.స్వామి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img