Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజు అరెస్ట్

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో బీసీ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారిని పరామర్శించడానికి సంఘీభావం తెలపడానికి శనివారం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రాజు కొనకొండ్ల గ్రామానికి బయలుదేరుతుండగా విషయం తెలుసుకున్న ఉరవకొండ పోలీసులు ఆయన అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు విలేకరులతో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనకొండ్ల గ్రామంలో దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img