Monday, June 5, 2023
Monday, June 5, 2023

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గొర్రెల మేకల ఫెడరేషన్ చైర్మన్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కార్యాలయం నందు సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లా గొర్రెల మేకల కోపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ పసుపుల నరసింహ గౌడ్ ఎంపికైనందున సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు సన్మానించి ఆశీర్వదించాలని కోరారు ఎంపిక పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడిన ప్రాంతము కావున ఎక్కువగా పశుసంపద మీద గొర్రెలు మేకల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి వారందరిని గుర్తించి వారికి తగిన సహాయ సహకారాలు ఫెడరేషన్ ద్వారా అందించాలని సూచించారు ఆయనతోపాటుగా రాప్తాడు జిల్లా పరిషత్ సభ్యులు పసుపుల హేమావతి ఆదినారాయణ, డైరెక్టర్ కృష్ణప్ప, హరికృష్ణ చిట్రా మల్లికార్జున, సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎంకొత్తపల్లి సుధాకర్ ,శంకర్ రెడ్డి, ఆదినారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img